గణేశుడి ఊరేగింపులో ఆకట్టుకున్న కత్తి సాము
అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గణపతి నవరాత్రులు పూర్తైన సందర్భంగా స్వామివారిని బుధవారం పల్లకిపై మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. ఈ మేరకు కామిశెట్టి పేరయ్య అనే రైతు చేసిన కత్తి సాము భక్తులను, చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.