అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం నుంచి కె. జగన్నాథపురం వరకు రోడ్డు పూర్తి అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు పది కిలోమీటర్ల మేర పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో గోతులలో పడి వాహనదారుల ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులకు స్పందించి రోడ్డు నిర్మించాలని స్థానిక ప్రజలు వాహనదారులు వాపోతున్నారు.