సూర్యారాధనలో జస్టిస్ శివశంకరరావు
మండలంలో జరుగుతున్న సూర్యారాధన మాస దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర జుడీషియల్ ప్రివ్యూ ఛైర్మన్ బులుసు శివశంకరరావు శుక్రవారం పాల్గొన్నారు. సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి సూర్య తీర్థాన్ని స్వీకరించారు.ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్నిసురక్షితంగా ఉంచేందుకు ఇలాంటి యాగాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ నెల 25న పంపచమాస దీక్ష్ సూర్యారాధన కార్యక్రమం పూర్ణ హుతితో ముగుస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆదివారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలపారు.