Mar 28, 2025, 16:03 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు
Mar 28, 2025, 16:03 IST
మత సామరస్యానికి పండుగలు ప్రతీకలుగా మిగులుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తరఫున పెబ్బేరు మండల కేంద్రంలోని మసీదులో, ప్రభుత్వం తరఫున సహారా ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే హాజరయ్యారు. హిందూ ముస్లిం తేడా లేకుండా పండుగలు కలిసి జరుపుకోవడం ఐక్యతకు నాందిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.