వాడపల్లిలో భక్తులను ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈనెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న అధ్యయనోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండవ రోజు చతుర్వేద పారాయణం ద్రవిడ వేద పారాయణం జరిగింది. అనంతరం పల్లకిపై గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు.