గాజు గ్లాస్ గుర్తు.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు

570చూసినవారు
గాజు గ్లాస్ గుర్తు.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు
స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన పార్టీ నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించటం వల్ల ఎన్డీయే కూటమికి నష్టం వాటిల్లుతుందని హైకోర్టును ఆశ్రయించారు. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని ఈసీ స్పష్టం చేసింది.