దేవీపట్నం: పాపికొండలు విహార యాత్రకు 200 మంది పర్యాటకులు
దేవీపట్నం మండలం నుంచి పాపికొండలు విహారయాత్రకు పర్యాటకులు భారీగా వెళ్లి వచ్చారు. శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి గోదావరి నది లో నాలుగు బోట్లపై 200 మంది పర్యాటకులు పాపికొండలు విహార యాత్రకు వెళ్లినట్లు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగిందని అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.