ఓ మహిళ రైలు నుంచి దూకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలులో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె ఈ షాకింగ్ పని చేసింది. మధ్యప్రదేశ్లోని ఒరై-అట్టా మధ్య వెళుతున్న బరౌనీ ఎక్స్ప్రెస్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ తన భర్తతో రైలు డోర్ దగ్గర ఉండగా ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనను పక్కన వారు వీడియో తీస్తున్నారు. ఇంతలోనే ఆమె అనూహ్యంగా రైలు నుంచి దూకేసింది.