‘క’ సినిమా చూసిన ‘క్రిష్ణగిరి’ లాంటి ఊరు నిజంగానే ఉంది. తెలంగాణలోని పెద్దపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ‘మూడుజాముల కొదురుపాక’ అనే ఊరి ఉంది. ఈ ఊరిలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 జాములే ఉంటాయి. సినిమాలో చూపిన ఊరిలో మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుంది. కానీ ఇక్కడ గంట ఆలస్యంగా 4 గంటలకే చీకటి పడుతుందంట. నాలుగు దిక్కుల్లో నాలుగు కొండలు ఉండడంతో ఇలా అవుతుందట. సినిమాలో చూపించిన ఊరు లాంటి ఊరు నిజ జీవితంలో ఉండడం ఆసక్తిగా ఉందని చెప్పాలి.