కన్నడ నటుడు యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే కొంచెం రెస్ట్ తీసుకుని.. కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో సందడి చేశారు. ఆయన డ్యాన్స్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతూ.. విజిల్స్ వేస్తూ ప్రోత్సహించారు. తన డ్యాన్స్‌ను ఆశ్చర్యంగా చూస్తున్న కుమార్తెను ముద్దాడారు. అనంతరం ఆ చిన్నారి సైతం స్టెప్పులేసి అలరించింది. ఈ వీడియోను యశ్ భార్య రాధికా పండిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.