ఎన్నికల విధులు నిర్వహించే అవకాశం: సీఐ
ఎన్నికల విధులు నిర్వహించేందుకు కడియం మండల పరిధిలో ఆసక్తి ఉన్న ఎన్. సి. సి, ఎన్. ఎస్. ఎస్ పూర్తి చేసిన యువతీ, యువకులు, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది, ఎక్స్ సర్వీస్మెన్ లు కడియం పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సీఐ బి. తులసీదర్ కోరారు. శుక్రవారం సాయంత్రం కడియంలో ఆయన మాట్లాడుతూ ఇందుకుగాను ఎన్నికల నిర్వహణ భృతిని చెల్లిస్తామన్నారు. అలానే పోలీసు శాఖ వారి నుండి ప్రశంసా పత్రం అందజేస్తామని తెలియజేశారు.