అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం స్వాధీనం
కడియం మండలంలోని వీరవరం గ్రామంలో అక్రమంగా నిల్వచేసిన 2, 077 కిలోల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5. 14 లక్షలు ఉంటుందని తెలిపారు. రేషన్ బియ్యం కొనుగోలు చేసిన పసలపూడి గంగరాజు, పాబోలు గణపతి, వ్యాన్ డ్రైవర్ వాసిరెడ్డి పద్దయ్యలపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ నాగవెంకటరాజు తెలిపారు.