తూ. గో పొట్టిలంక - కడియపులంక వరకూ బోటు విహారం: జిల్లా కలెక్టర్
తూ. గో జిల్లాలో ఇకో టూరిజం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పొట్టిలంక గ్రామం నుంచి కడియపులంక వరకు కెనాల్లో బోటింగ్ విహారం చేసే విధానంలో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం అధికారులతో కలిసి కడియం మండలంలో పర్యటించారు. జిల్లాలో పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ తగిన ప్రతిపాదనలను అందజేయాలన్నారు.