పాలాలమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే
పెదపూడి మండలం దోమడ గ్రామంలో వేంచేసి ఉన్న పలాలమ్మా అమ్మవారిని శుక్రవారం అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ కోర్కెలు తీర్చే కల్పవల్లిగా గ్రామస్తులు పూజిస్తారు. శాసనసభ్యులు వెంట గ్రామ శాఖ అధ్యక్షులు కాకర్ల గోవిందు, మద్దిపూడి దొరబ్బాయి, జనసేన సమన్వయకర్త రావడ నాగు, దేవస్థానం చైర్మన్ పాలచర్ల వెంకట్రావు పాల్గొన్నారు.