Sep 13, 2024, 05:09 IST/
ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం
Sep 13, 2024, 05:09 IST
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి కీర్త నగర్, ఐటీవో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.