ఎగువ కర్ణాటక ప్రాజెక్టులతో పాటు కృష్ణా నదికి ఉపనది అయిన భీమా నది నుంచి కూడా జూరాలకు వరద తగ్గుముఖం పట్టడంతో గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జూరాల గేట్లను అన్ని మూసి వేసినట్లు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా జూరాల ప్రాజెక్టుకు పైనుంచి వస్తున్న కొద్దిపాటి వరదతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నట్లు శుక్రవారం అధికారులు పేర్కొన్నారు.