Nov 08, 2024, 04:11 IST/
మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పదా?
Nov 08, 2024, 04:11 IST
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. రూ.55 కోట్ల చెల్లింపు వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాయడం, మరోవైపు తనను అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చని, దేనికైనా రెడీ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. అరెస్ట్ చేస్తారని తెలిసే కేటీఆర్ అలా అన్నారా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.