బాలిక అదృశ్యంపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే కామవరపుకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.