
చింతలపూడిలో పోలీస్ ఐలాండ్ నిర్మాణం
ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పోలీస్ అధికారులు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గురుభట్లగూడెం రోడ్డు ప్రధాన సెంటర్లో పోలీస్ ఐలాండ్ ను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్ పరిశీలించారు. అలాగే పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు.