జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో ఉన్న మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించి కార్తీక మహోత్సవాల కార్యక్రమ ఆహ్వానానికి ప్రజా ప్రతినిధులను పిలవకపోవడం బాధాకరమని జడ్పీటీసీ బాబ్జి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ. ప్రస్తుత అధికారులు ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలకు ఆహ్వానం లేదన్నారు. కార్తీకమాస ఉత్సవాల సందర్భంగా కనీసం స్థానిక సర్పంచ్‌కు కూడా ఆహ్వానం లేదని ఎవరి నిర్లక్ష్యమో తెలియదన్నారు.