మైలవరం మండలం పొందుగుల, అనంతవరం గ్రామాల్లో అక్రమ మట్టి తోలకాల కోసం టీడీపీ వర్గాల్లో ఆధిపత్య పోరు సోమవారం నడిచింది. ఎర్ర చెరువులోకి అక్రమ మట్టి తవ్వకాలను రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. 5 ట్రాక్టర్లు, ప్రోక్లేయనర్ ను ఎమ్మార్వో కార్యాలయానికి ఇరిగేషన్ అధికారి శ్రావణి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది తరలించారు.