వేలేరుపాడు మండలం వరద ప్రభావిత ప్రాంతాలలో గురువారం పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు పర్యటించారు. ఈ కార్యక్రమంలో వెలరుపాడు మండలం తిరుమలపురం గ్రామంలో ప్రభుత్వం తరఫున 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, పామయిల్, బంగాళాదుంపలు ఇవి కాక ప్రాంతాల వారి ఆరోగ్యం గురించి ఆలోచించి అదనంగా టమాటాలు పచ్చిమిర్చి, దొండ, బెండ, వంకాయ వంటి కూరగాయలు బాధితులకు పంపిణీ చేశారు.