పోలవరం: ఉరుకులు.. పరుగులు
పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడిప్పుడే ఆరంభమై ఊపందుకుంటున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశకు నిధులొచ్చాయి. అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసేందుకు సన్నాహాలు, గోతుల రోడ్లకు నిధులు ఇచ్చి మోక్షం వచ్చింది. ధాన్యం సేకరణలో గత అనుభవాలకు తెరదింపి తక్షణ పరిష్కారానికి మార్గం సుగమం. ఇలా ఒకటే మిటి ఇన్నాళ్లు మూలనపడ్డ వాటన్నింటికి నిర్వీర్యం స్థానంలో ఉత్తేజం నెలకుంటోంది.