జీలుగుమిల్లి: కోడి పందేల్లో జబర్దస్త్ నటులు సందడి
జీలుగుమిల్లిలో నిర్వహిస్తున్న కోడి పందేలను తిలకించేందుకు జబర్దస్త్ నటీ నటులు బుధవారం వచ్చారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి జబర్దస్త్ నటుడు ఆటో రాంప్రసాద్, ఇతర మహిళా నటులు కోడి పందేలను తిలకించారు. వారితో ఫొటోలు, సెల్పీలు దిగేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.