తాడేపల్లిగూడెంలో సమాజం తలదించుకుని విధంగా ఐదు రోజుల్లోపు ఆడ పసికందును చెత్త కుండీలో కవర్లో పెట్టి పారేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కనీసం పేగు కోత ఆరకుండానే పసి కందును చెత్త కుప్ప పాలు చేశారు.ఈ సంఘటన తాడేపల్లిగూడెం ఏడవ వార్డులో సచివాలయం సమీపంలో వెలుగు చూసింది.సంఘటన స్థలానికి పట్టణ ఎస్ఐ సుధాకర్ రెడ్డి చేరుకుని పసి కందు భౌతిక కాయాన్ని పరిశీలించారు.