![జంగారెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో భవానీ మాలదారుడు మృతి జంగారెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో భవానీ మాలదారుడు మృతి](https://media.getlokalapp.com/cache/b2/c3/b2c3f5f43837d1614b2e287088efdcc0.webp)
జంగారెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో భవానీ మాలదారుడు మృతి
జంగారెడ్డిగూడెంకి చెందిన పంచాడ హరి ప్రసాద్(24) భవానీ మాలధారణ చేసి ఈ నెల 19న ఇరుముళ్లు కట్టుకుని, దీక్ష విరమణ నిమిత్తం విజయవాడ ఇంద్రకీలాద్రికి కాలినడకన బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున 5. 30 గంటల సమయంలో వీరవల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హరిప్రసాద్ ను చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్ధార్ధ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.