తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గోదావరి గ్రామీణ భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు శనివారం గ్రామ సచివాలయం ఎదుట ఆందోళన చేశారు. ఉచిత ఇసుక సరఫరా మెరుగుపరచాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెల్ఫేర్ బోర్డు అమలు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేరతి ఆదినారాయణ కోరారు. అనంతరం పంచాయతీ సెక్రెటరీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి సంఘం గ్రామ అధ్యక్షుడు కంకిపాటి రాజు పాల్గొన్నారు.