తణుకు: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి
తణుకు మండలం దువ్వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. వెంకయ్య వయ్యేరు కాలువ వంతెన సమీపంలో సుమారు 60 నుంచి 65 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడిని తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తణుకు రూరల్ పోలీసులు తెలిపారు.