AP: కోడి పందెం శిబిరం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు గ్రామాల యువకులు దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగింది. కోడి పందెంలో వణుకూరు, పునాదిపాడు గ్రామాల యువకులు పాల్గొన్నారు. ఏమైందో తెలియదు. కానీ ఇరుగ్రామాల యువకులు గొడవకు దిగారు. మాట మాట పెరగడంతో బీర్ సీసాలతో కొట్టుకున్నారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. కొందరి తలలూ పగిలాయి. ఘర్షణలో గాయపడిన ఓ వ్యక్తి కంకిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.