AP: హీరో మంచు విష్ణు గొప్ప మనసు చాటుకున్నారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలోని మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘120 మంది చిన్నారులకు విద్య, వైద్యంతో పాటు కుటుంబ సభ్యుడిలా తోడుంటాను. కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ నేను చేసిన మంచి పనికి మరొకరు ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను.’ అని అన్నారు.