మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ రాజు కన్నుమూత

69చూసినవారు
మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ రాజు కన్నుమూత
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత రుద్రరాజు సత్యనారాయణ రాజు (98) నిన్న భీమవరం పట్టణంలో కన్నుమూశారు. ఆయన స్వగ్రామం చించినాడలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈయన 1952 నుంచి 1965 వరకు యలమంచిలి మండలం చించినాడ సర్పంచ్‌గా పని చేశారు. 1967లో ఎమ్మెల్యేగా గెలిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్