ఏపీలో రేషన్ కార్డు లేనివారికి మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. వరద ద్వారా నష్టపోయినవారికి రేషన్ కార్డు లేకపోయిన నిత్యావసరాలు సరుకులు అందజేస్తామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడదని మంత్రి తెలిపారు. ఇప్పటికే విజయవాడలో వరద బాధితుల కోసం ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.