మైలవరం ఎర్ర చెరువుకు గండి

56చూసినవారు
మైలవరం ఎర్ర చెరువుకు గండి
ఏపీలో భారీ వర్షాల కారణంగా మైలవరం ఎర్ర చెరువుకు గండి పడింది. గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువు నిండిపోయింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు కలింగం వద్ద చెరువుకు గండి పెట్టి నీరును దిగువకు వదిలి అనంతరం చెరువుకు పడిన గండిని నేతలు పూడుస్తున్నారు. ఎర్ర చెరువు నీటిని దిగువకు విడుదల చేయడంతో జి.కొండూరు మండలం గుర్రాజుపాలెం గ్రామానికి వరద ముప్పు పొంచివుంది. దీంతో గుర్రాజుపాలెం కొత్తూరులోని ప్రజలు ఇళ్ళు ఖాళీ చేయాలని పోలీసులు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్