ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఎల్ 1ఆర్డీ రిజిస్టర్డ్ వేలిముద్ర స్కానర్లను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 53.70 కోట్ల రూపాయలను కేటాయించింది. పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను నివారించేందుకు ఈ విధానాన్ని త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించనుంది.