ఇంటివద్దే ఓటేసే ప్రక్రియ ప్రారంభం

73చూసినవారు
ఇంటివద్దే ఓటేసే ప్రక్రియ ప్రారంభం
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 73 శాతం హోంఓటింగ్‌ శుక్రవారం పూర్తి చేసినట్లు నగర కమిషనర్‌ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం చౌత్రా సెంటర్లో జరుగుతున్న హోంఓటింగ్‌ను తూర్పు నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్ధుల ఎలక్షన్‌ ఏజెంట్ల సమక్షంలో కమిషనర్‌, ఆర్‌ఓ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా హోంఓటింగ్‌ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్