యార్డులో 65, 876 బస్తాల మిర్చి విక్రయం

70చూసినవారు
యార్డులో 65, 876 బస్తాల మిర్చి విక్రయం
గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 50, 957 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 65, 876 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నెంబర్-5, 273, 341, 4884 సూపర్10-రకాల మిర్చి సగటు ధర రూ. 8, 500 నుంచి రూ. 18, 500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ రకాల మిర్చి సగటు ధర రూ. 8, 000 నుంచి 20, 000 వరకు ధర లభించిందని యార్డు ఇన్చార్జి కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్