అనధికారిక స్పీడ్ బ్రేకర్లతో ప్రజల ఇక్కట్లు

570చూసినవారు
మంగళగిరి నగరంలో కొత్తపేటలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ వలన ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. రాత్రి సమయాల్లో ఈ స్పీడ్ బ్రేకర్లు కనిపించక వాహనదారులు, ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నట్లు తెలిపారు. మంగళగిరి - తాడేపల్లి కార్పోరేషన్ అధికారులు స్పందించి నగరంలో అనధికారికంగా ఉన్న స్పీడ్ బ్రేకర్లను తోలగించాలని స్థానికులు కోరుతున్నారు.