అబద్ధపు హామీలు ఇచ్చే పార్టీలను నమ్మకండి: అంబటి

54చూసినవారు
అబద్ధపు హామీలు ఇచ్చే పార్టీలను నమ్మకండి: అంబటి
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసిపికి ఓటు వెయ్యాలని పొన్నూరు వైసిపి అభ్యర్థి అంబటి మురళీకృష్ణ అన్నారు. బుధవారం ఉప్పలపాడు గ్రామంలోనీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. అబద్ధపు హామీలు ఇచ్చే పార్టీలను నమ్మవద్దని పేర్కొన్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ భీమవరపు విజయలక్ష్మి, మాజీ మానవ హక్కుల సభ్యులు గోచిపాత శ్రీనివాసరావు, వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్