Apr 08, 2025, 08:04 IST/కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్ లో సీపీఐ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట
Apr 08, 2025, 08:04 IST
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులకు, సీపీఐ నేతలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్, పెట్రోల్ రేట్లు దేశంలో సామాన్యుడిని నడ్డి విరిచేలా ధరలు పెంచుకుంటూ పోతుందని మంగళవారం నిరసన తెలిపారు. ఈ క్రమంలో దిష్టిబొమ్మ దహనం చేసినందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.