TG: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన నెలరోజులకే వేధింపులు తాళలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మార్చి 16న శృతి (21) అనే యువతికి గొల్లపల్లి గ్రామానికి చెందిన సాయితో వివాహమైంది. పెళ్లి సమయంలో 8 తులాల బంగారం, లక్ష నగదు కూడా ఇచ్చారు. అయితే పెళ్లైన వారం నుంచే అదనపు కట్నం కోసం అత్తింటివారు ఒత్తిడి చేశారు. మనస్థాపం చెందిన శృతి బాత్‌రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.