స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ఏడేళ్ల బాలుడి మృతి
By Rathod 51చూసినవారుAP: విశాఖ సీతమ్మధార పోర్టు స్టేడియంలోని ఆక్వా వరల్డ్ వాటర్ పార్కు స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. మురళీనగర్‌కు చెందిన గంగాధర్, కల్పన దంపతుల కుమారుడు రుషి కుటుంబంతో కలిసి ఆక్వా వరల్డ్ పార్కులోకి ఆడుకునేందుకు వచ్చాడు. సృహ తప్పి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోగా.. నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రుషి మృతితో కుటుంబీకులు ఆందోళనకు దిగారు.