పవన్ చిన్న కుమారుడి హెల్త్ అప్‌డేట్

64చూసినవారు
పవన్ చిన్న కుమారుడి హెల్త్ అప్‌డేట్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్‌లోని 2, 3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఊపిరాడక అస్వస్థతకు గురయ్యాడు. చిన్నారి ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మార్క్ శంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కాలికి, చేతులకు గాయాలయ్యాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్