AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్‌లోని 2, 3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 15 మంది చిన్నారులతో పాటు టీచర్లు గాయపడినట్లు సమాచారం. మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. మిగిలిన విద్యార్థులను రెండో అంతస్తు నుంచి కిందికి దింపుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.