అద్దంకి పట్టణంలో బుధవారం రాత్రి ఎస్సై ఖాదర్ బాషా తన సిబ్బందితో నైట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణంలో అన్ని వీధుల్లో గస్తీ చేపట్టారు. స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్నవారితో మాట్లాడి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో నైట్ పెట్రోలింగ్ ను ముమ్మరం చేస్తున్నట్లు ఎస్సై ఖాదర్ భాషా చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 100కు డయల్ చేయాలని ఆయన సూచించారు.