బాపట్ల పట్టణం ప్రభుత్వ గిరిజన బాలుర హాస్టల్ ను సోమవారం మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయారు. కనీస వసతులు లేని హాస్టల్లో విద్యార్థులు ఉంటున్న తీరును చూసి బాధను వ్యక్తపరిచి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని లేనిచో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.