గిరిజన బాలికలకు పుస్తకాలు , ఆహార పదార్థాలు అందజేత

55చూసినవారు
గిరిజన బాలికలకు పుస్తకాలు , ఆహార పదార్థాలు అందజేత
సమ సమాజ స్థాపనకు బాలిక విద్య తోడ్పడుతుందని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావుఅన్నారు. శుక్రవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కర్లపాలెంలో లంకలో ఉన్న గిరిజన బాలికలకు నోటు పుస్తకాలు , ఆహార పదార్థాలు అందించారు. పోలీసు రావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజానికి అందరు కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో పరమానంద కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్