బాపట్లలో అర్ధరాత్రి విగ్రహాల ఏర్పాట్ల వివాదం

51చూసినవారు
బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి 1 గంటలకు వైసిపి మరియు టిడిపి వర్గాల మధ్య వివాదం నెలకొంది. పాత బస్టాండ్ సమీపంలో మాజీ గవర్నర్ కోన ప్రభాకర్ రావు విగ్రహ ఏర్పాటుపై దిమ్మెను నిర్మిస్తుండగా పట్టణ సీఐ దిమ్మెను తొలగించాలి అనడంతో వివాదం మొదలైంది. టిడిపి నేతలు కూడా అక్కడికి చేరుకోవడంతో వివాదం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడ నుంచి పంపించేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్