గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 20 ఫిర్యాదులు, ప్రొగ్రెస్సివ్ రిడ్రెస్సల్ సిస్టమ్ కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందాయి. జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలన్నారు.