పర్మిట్ లేని మంచినీటి ట్యాంకర్ల పై కేసులు

74చూసినవారు
పర్మిట్ లేని మంచినీటి ట్యాంకర్ల పై కేసులు
గుంటూరు నగరంలో నీళ్లు సరఫరా చేసే వాటర్ ట్యాంకర్లపై రవాణాశాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వర్మిట్, పన్నులు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని లారీ ట్యాంకర్లపై 3, ట్రాక్టర్లపై 2, మొత్తం 5 కేసులు నమోదు చేసినట్టు డీటీసీ కరీం తెలిపారు. నిరంతరం తనిఖీలు జరుగుతున్నాయని, నిబంధనలు పాటించని ట్యాంకర్లను సీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్