గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని జనసేన పార్టీ సమన్వయకర్త కటకం అంకారావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఎన్నికలకు ముందు సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే కాసు గౌరవంగా మాట నిలబెట్టుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.